MUSINGS


                                      గడ్డిపరకతో విప్లవం నుంచి....

ఒక రోజు నాలుగేళ్ల పిల్ల తల్లినడుగుతోంది ’’నేను ఎందుకు పుట్టాను? బడికి వెళ్లడానికేనా? అని. ’’అవును బడికి వెళ్లడానికే పుట్టావు‘‘ అని తల్లి నిజాయితీగా చెప్పలేకపోయింది. చూస్తుంటే బడికి వెళ్లడానికే మనుషులు పుడుతున్నారనిపిస్తోంది. ఎందుకు పుట్టారో తెలుసుకోడానికే కష్టపడి కాలేజీ వరకు చదువుతారు. జీవితం నాశనమైనా సరే ఎందుకు పుట్టామో తెలుసుకుంటే చాలని పండితులు తత్వవేత్తలు తంటాలు పడుతుంటారు. మనిషి జీవితానికి ఒక ఉద్దేశమంటూ లేదు. అది ఉందని ఊహించుకుని దాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఇది ఒకే మనిషి చేసే ముష్టియుద్ధం లాంటిది. జీవితానికి ఉద్దేశమంటూ ఊహించుకోనవసరం లేదు. దానికోసం వెతకనవసరం లేదు. ఉద్దేశం లేని జీవితం అర్ధరహితమేమో పిల్లలను అడిగి చూడండి. నర్సరీలో చేరినప్పటి నుంచి పిల్లల కష్టాలు మొదలవుతాయి. మనిషి సంతోష జీవే. కానీ కష్టాలు కొని తెచ్చుకుని వాటి నుంచి బయటపడటానికి సతమతమవుతున్నాడు. ప్రకృతిలో చావు పుట్టుకలు లేవు. ప్రకృతి సంతోషమయంగా ఉంది. మానవ సమాజంలో చావు పుట్టుకలున్నాయి. ప్రజల్లో విషాదముంది.
                                                               -మసనోబు ఫుకుఓకా
(మసనోబు ఫుకుఓకా జపాన్ కు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ప్రకృతి సహజమైన వ్యవసాయంపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. మనుషులైనా, చెట్లయినా, జంతువులయినా ప్రకృతి సిద్ధంగా పెరిగినప్పుడే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయంటాడు మసనోబు. ఇప్పటి ఆధునిక వ్యవసాయంవల్లా, మానవ జీవన విధానంవల్లా ఆరోగ్యం, సంతోషం రెండూ ఉండవని, ఉన్నా తాత్కాలికమేనంటాడు. ఆయన రాసిన one straw revolution అనే పుస్తకం నుంచి ఈ కొటేషన్లు. తెలుగు అనువాదం గడ్డిపరకతో విప్లవం సౌజన్యంతో )

No comments:

Post a Comment